ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ గ్రాండ్ ఫినాలే లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది. ఫినాలే లెవెల్ 1 లో సెలెక్ట్ ఐన ముగ్గురు కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు లెవెల్ 2 లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ వారం శేఖర్ మాస్టర్ ఈ లెవెల్ కి సంబంధించిన రూల్స్ చెప్పేసారు. "ప్రతీ కొరియోగ్రాఫర్ కి 90 సెకన్ల టైం ఇస్తున్నాం. ఈ టైం గ్యాప్ లో వాళ్లకు నచ్చిన స్టైల్ లో వాళ్ళ కంటెస్టెంట్స్ తో కోరియోగ్రఫీ చేసి మా ముందు పెర్ఫార్మ్ చేసి మమ్మల్ని ఇంప్రెస్స్ చేయాలి. దీనికి సీక్రెట్ స్కోరింగ్ ఉంటుంది. ఈ ముగ్గురు కొరియోగ్రాఫర్స్ పెర్ఫార్మ్ చేసేశాక స్కోర్స్ రివీల్ చేస్తాం...ఎవరైతే లీస్ట్ స్కోరర్ గా ఉంటారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. మిగతా ఇద్దరు కొరియోగ్రాఫర్స్ గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇస్తారు." అని చెప్పారు. అలా ఈ లెవెల్ లో పండు మాష్టర్ ఎలిమినేట్ అయ్యారు..
అలాగే గ్రీష్మ, సోమేష్ మాష్టర్ గ్రాండ్ ఫినాలే లెవెల్ 2 లోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన రూల్స్ చెప్పారు శేఖర్ మాష్టర్.."ముందు గ్రూప్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి..వాటిని నేను, శ్రద్ద, శ్రీలీలే మార్క్స్ వేస్తాం. తర్వాత ఫైనల్ గా షూటౌట్ రౌండ్ ఉంటుంది. అందులో సిక్స్ క్యాటగిరీస్ ఉంటాయి. డాన్స్ విత్ ప్రాపర్టీ, ఫోక్, హిప్ హాప్, ట్రియో, సల్సా, షూటౌట్ రౌండ్స్ ఉంటాయి..షూటౌట్ లో వచ్చే మార్క్స్, గ్రూప్ పెర్ఫార్మెన్సెస్ లో వచ్చే మార్క్స్ కౌంట్ చేసి ఎవరికీ ఎక్కువ వస్తాయో వాళ్ళే విన్నర్" అని అనౌన్స్ చేశారు. ఫైనల్లీ అన్ని రౌండ్స్ పూర్తి చేసుకున్నాక సోమేష్ మాష్టర్ ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ టైటిల్ విన్నర్ అంటూ శ్రీలీల అనౌన్స్ చేసింది. ఇక ఢీ టైటిల్ తో పాటు సోమేష్ మాష్టర్ టీం 75 లక్షల కాష్ ప్రైజ్ గెలుచుకున్నారు. టీం విన్ అయ్యిందన్న ఆనందంలో స్టేజి మీద అందరూ డాన్స్ చేస్తూ ఉండగా ఓడిపోయిన గ్రీష్మ కళ్ళు తిరిగి పడిపోయింది. తర్వాత కాసేపటికి లేచి కూర్చుంది.